తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉందంటే..

X
తిరుమల: తిరుమల తిరుమతి శ్రీ వెంకటేేశ్వర స్వామివారి ఆలయంలో భక్తుల రద్ద కొనసాగుతోంది. శనివారం వెంకన్నను దర్శించుకునేందుకు తిరుమలకు భారీగా భక్తులు తరలివస్తున్నారు. ఈ క్రమంలో స్వామివారిని దర్శించుకునేందుకు వైకుంఠ కాంప్లెక్స్ లోని 21 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి వున్నారు. దీంతో వెంకన్న సర్వదర్శనానికి టోకెన్ లేని భక్తులకు 10 గంటల సమయం పడుతుంది.
కాగా, శుక్రవారం శ్రీవారిని 70,044 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో శ్రీవారికి 25,559 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఇక, నిన్న స్వామివారి హుండీ ఆదాయం రూ.3.47 కోట్లుగా ఉందని టిటిడి అధికారులు వెల్లడించారు.
Next Story
-
Home
-
Menu
