తిరుమలలో భక్తుల రద్దీ.. దర్శనానికి ఎంత సమయమంటే?

Huge Devotees to visit Tirumala Temple
X

Huge Devotees to visit Tirumala Temple

తిరుపతి: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. తిరుమల వెంకన్నను దర్శించుకునేందుకు గురువారం అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. ఈ క్రమంలో వెంకన్న సర్వదర్శనం కోసం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 7 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. దీంతో టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల నుంచి 14 గంటల సమయం పడుతుంది.

ఇక, బుధవారం తిరుమల వెంకన్నను 69,649 మంది భక్తులు దర్శించుకున్నారు. ఇందులో 24,644 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.85 కోట్లుగా ఉన్నట్లు టిటిడి అధికారులు వెల్లడించారు.


Tags

Next Story