తిరుమలకు పోటెత్తిన భక్తులు.. 31 కంపార్టుమెంట్లు ఫుల్

తిరుపతి: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో భారీగా భక్తుల రద్దీ నెలకొంది. ఆదివారం తెల్లవారుజాము నుంచే తిరుమలకు భక్తులు పోటెత్తారు. దీపావళీ పండగ నేపథ్యంలో స్వామివారిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తిరుమలకు తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలో శ్రీవారి సర్వదర్శనం కోసం వైకుంఠ క్యూ కాంప్లెక్స్ లోని 31 కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి. దీంతో స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు గంటల తరబడి నిరీక్షిస్తున్నారు. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటల సమయం పడుతోంది. కాగా, శనివారం తిరుమల వెంకన్నను 80,367 మంది భక్తులు దర్శించుకున్నారని టీటీడీ అధికారులు వెల్లడించారు. ఇందులో 27,401 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారికి హుండీ ద్వారా రూ.3.34 కోట్ల ఆదాయం సమకూరినట్లు టిటిడి అధికారులు తెలిపారు
-
Home
-
Menu
