పెచ్చులూడుతున్నాయి... ప్రాణభయం వెంటాడుతోంది
ప్రాణాలు పోతేనే స్పందిస్తారా?
భయాందోళనలో 150 మంది విద్యార్థులు
తాత్కాలిక భవనానికి తరలింపు ఎప్పుడు?
కలెక్టర్ ఆదేశాలు బేఖాతరా?
రూ.3.22 కోట్లతో కొత్త భవనం
నిర్మించడానికి మంజూరు
పైకప్పు నుంచి ఊడిపడుతున్న పెచ్చులు
మన తెలంగాణ/ధన్వాడ: వేసవిలోనే తరలించాలని కలెక్ట ర్ ఆదేశం.. అయినా అదే శిథిల భవనంలో కొనసాగుతున్న వసతి ముసురు వానలు కురుస్తున్న వేళ ధన్వాడ ఎస్సీ హాస్టల్ విద్యార్థులు భయాందోళనల మధ్య కాలం వెళ్లదీస్తున్నారు. ఏళ్ల తరబడి మరమ్మతులకు నోచుకోని హాస్టల్ భవనం ఇప్పటికే శిథిలావస్థకు చేరుకో గా.. తాజాగా వర్షాల ప్రభావంతో పైకప్పు నుంచి పెచ్చులు ఊడిపడు తున్నాయి. ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలోని వివిధ మండలాల నుంచి వచ్చిన సుమారు 150 మంది విద్యార్థులు ఇదే భవనంలో ఉంటున్నారు.
నిధులు మంజూరైనా.. కొత్త భవనం ఎప్పుడో?
ధన్వాడ ఎస్సీ హాస్టల్ దుస్థితిని గుర్తించిన నారాయణపేట ఎమ్మెల్యే చి ట్టెం పర్ణిక రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకున్నారు. నూతన హాస్టల్ భవన ని ర్మాణానికి రూ.3.22 కోట్ల నిధులు మంజూరు చేయించి పరిపాలనా అనుమతులు ఇప్పించారు. దీంతో కొత్త భవనం నిర్మాణానికి మార్గం సుగమమైనా..టెండర్లు, నిర్మాణ పనులు పూర్తయ్యే వరకు సమయం ప ట్టే అవకాశం ఉంది. అప్పటివరకు విద్యార్థుల భద్రతకు అధికారులు ప్ర త్యామ్నాయ ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉందని తల్లిదండ్రులు కోరుతున్నారు.
కలెక్టర్ ఆదేశాలు బేఖాతరా?
శిథిల భవనాన్ని పరిశీలించిన రాష్ట్ర బాలల హక్కుల చైర్మన్ సీతా ద యాకర్‌రెడ్డి, అప్పటి జిల్లా కలెక్టర్ ప్రీతిక్ జైన్, ప్రస్తుత కలెక్టర్ సిహెచ్ ప్రియాంకలు పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఇలా ంటి భవనంలో విద్యార్థులు ఎలా ఉంటున్నారంటూ అధికారులు విస్మయం వ్యక్తం చేశారు. వేసవి సెలవుల్లోనే హాస్టల్‌ను తాత్కాలిక భవనంలోకి తరలించాలని కలెక్టర్ ఆ దేశించినప్పటికీ, విద్యా సంవత్సరం ప్రారంభమైనా ఆదేశాలు అమలుకాలేదని విద్యార్థులు వాపోతున్నారు.
ఎంపీ పరిశీలించినా.. మారని పరిస్థితి
ఇటీవల ఎంపీ డీకే అరుణ సైతం హాస్టల్‌ను సందర్శించి పైకప్పు పరిస్థితిని పరిశీలించారు. విద్యార్థుల భద్రత దృష్ట్యా హాస్టల్‌ను తాత్కాలిక భ వనంలోకి మార్చాలని సూచించినట్లు సమాచారం. అయినప్పటికీ ఇ ప్పటికీ విద్యార్థులు అదే శిథిల భవనంలోనే ఉంటున్నారు.
రాత్రివేళ మరింత ఇబ్బందులు
కొన్ని గదుల్లో ఫ్యాన్లు పనిచేయడం లేదని విద్యార్థులు చెబుతున్నారు. వర్షాకాలంలో దోమల బెడద విషపూతమైన పురుగులు కూడా తీవ్రం గా వస్తాయని విద్యార్థులు వాపోతున్నారు. పైకప్పు నుంచి పెచ్చులు ఊడిపడుతుండటంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని భయపడుతున్నామని అంటున్నారు. ఆర్థిక ఇబ్బందులతో పిల్లలను చదివిం చే స్తోమత లేని నిరుపేద తల్లిదండ్రులు ఎంతో నమ్మకంతో హాస్టల్‌లో చేర్పించారని, వారి భద్రతకు అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.“ప్రమాదం జరిగే వరకు వేచి చూడకుండా.. కలెక్ట ర్ ఆదేశాలను అమలు చేసి విద్యార్థులను సురక్షిత భవనానికి తరలించాలి” అని విద్యార్థుల తల్లిదండ్రులు, కోరుతున్నారు.
వివరణ: హాస్టల్ వార్డెన్ సాయిరెడ్డిని వివరణ కోరగా.. విద్యార్థుల భద్ర త దృష్ట్యా త్వరలోనే మరో భవనంలోకి తరలిస్తామని తెలిపారు.
-
Home
-
Menu


