దొరికిన ధరణి దొంగలు

3.9కోట్ల మేర ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టిన ముఠా 15 మంది
నిందితుల అరెస్ట్ భారీగా నగదు, విలువైన పత్రాలు స్వాధీనం
మన తెలంగాణ/వరంగల్ క్రైమ్/యాదాద్రి భువనగిరి ప్రతినిధి: రాష్ట్రంలో సంచలం సృష్టించిన జనగామ, యాదాద్రి జిల్లాల్లో ధరణి, భూ భారతి రిజిస్ట్రేషన్లలో రూ.3.9కోట్ల ప్రభుత్వ ఆ దాయానికి గండికొట్టిన కుంభకోణంలో 15 మందిని జనగామ పోలీసులు అరెస్టు చేశారు. మరో 9మంది ప్రస్తుతం పరారీలో ఉన్నారు. ముఠా సభ్యుల నుండి పోలీసులు స్వాధీనం చే సుకున్నవి 63.19లక్షల నగదు, బ్యాంక్‌లో రూ.లక్ష, సుమారు కోటి రూపాయల విలువైన ఆస్తి పత్రాలు, కారు, రెండు ల్యాప్‌టాప్‌లు, ఐ దు డెస్క్‌టాప్ కంప్యూటర్లు, 17 సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
శుక్రవా రం హనుమకొండలోని వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లో నిర్వహించిన సమావేశంలో వరంగల్ సిపి సన్ ప్రీత్‌సింగ్ వివరాలు వెల్లడించారు. యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన పసునూరి బసవ రాజు, జెల్లా పాండా, మహేశ్వరం గణేష్ కుమార్, జనగామకు చెందిన గజులపాటి శ్రీనాథ్, యెనగంధుల వెంకటేష్, కోదురి శ్రావణ్, జనగామ జిల్లా కొడకండ్లకు చెందిన కొలిపాక సతీష్‌కుమార్, నర్మెట్టకు చెందిన తడూరి రంజిత్‌కుమార్, యాదాద్రి జిల్లా ఆత్మకూరుకు చెందిన దుంపల కిషన్‌రెడ్డి, దశరథ మేఘావత్, యాదగిరిగుట్టకు చెందిన నారా భానుప్రసాద్, నల్గొండ జిల్లా అమంగల్ గ్రామానికి చెందిన గొపగాను శ్రీనాథ్, ఒగ్గు కరుణాకర్ శివకుమార్, అలేటి నాగరాజు లను అరెస్ట్ చేసినట్లు సిపి తెలిపారు.అరెస్టుకు సంబంధించి వరంగల్ పోలీస్ కమిషనర్ ప్రీత్ సింగ్ వివరాలు వెల్లడిస్తూ..
ఈ కుంభకోణంలో ప్రధాన నిందితులైన పసునూరి బసవరాజు, జెల్లా పాండు ఇరువురు యాదాద్రి-భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో ఆన్‌లైన్ సర్వీస్ నిర్వహించేవారు. నిందితుల్లో ఒకడైన గణేష్ తనకు తాను ఆన్‌లైన్ సెంటర్లతో పరిచయం చేసుకోని చెల్లించాల్సిన మొత్తాన్ని ఏన్‌ఆర్‌ఐ ఖాతా పే చేస్తానని చెప్పి రైతుల నుండి మొత్తం డబ్బులను మీ సేవ వ్యక్తుల ద్వారా వసూలు చేయించి.. వసూలు చేసిన డబ్బునుండి ఆన్‌లైన్ సర్వీస్ వ్యక్తులకు మరియు మద్యవర్తులకు కమిషన్ చొప్పున డబ్బు అందజేస్తూ ఇ చలాన్ ప్రధాన నిందితుడుకి పంపిచేవాడు. ఇలా వచ్చిన చలాన్లను బసవరాజు.. ధరణీ/ భూభారతీ వెబ్‌సైట్‌లో ఇన్‌సెట్ ఎడిట్ అప్లికేషన్ ఉపయోగించి చలాన్ రుసుము తగ్గించేవాడు.
ప్రత్యేక సాఫ్ట్‌వేర్ ద్వారా ఛలాన్ మార్ఫింగ్..
ఇదే క్రమంలో మొబైల్ ఆప్లికేషన్ ఉపయోగించి నిందితులు ప్రభుత్వానికి చెల్లించిన రుసుముకు సంబంధించి వెబ్‌సైట్‌లో జారీఅయిన రసీదులను చెల్లించాల్సిన దానికంటే తక్కువగా మార్పుచేసి.. అనంతరం మార్పు చేసిన రుసుమును మాత్రమే ప్రభుత్వానికి చెల్లించి.. నకిలీ చలాన్లను ఎమ్మార్వో/ రిజిస్ట్రేషన్ కార్యాలయములో మధ్యవర్తుల ద్వారా సమర్పిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొదుతూ మోసాలకు పాల్పడేవారు.
1080 రిజిస్ట్రేషన్లలో అవకతవకలు..
జనగామ, యాద్రాద్రి జిల్లాల్లో 1080 పత్రాలకు సంబంధించిన లావాదేవీల్లో నిందితులు మోసాలకు పాల్పడ్డారు. అలాగే ఈ రెండు జిల్లాలో జరిగిన కుంభకోణానికి సంబంధించి 22 కేసులు నమోయ్యాయి. ఇందులో జనగామ జిల్లాలో 7, యా దాద్రి జిల్లాలో 15 కేసులు నమోదైనట్టు వరంగల్ పోలీస్ కమిషనర్ వెల్లడించారు. 9మంది నిందితులను త్వరలోనే పట్టుకుంటామని వెల్లడించారు. జనగామ డిసిపి రాజమహేంద్ర నాయక్, ఏఎస్పీ పండరి చేతన్, జనగామ ఇన్‌స్పెక్టర్ సత్యనారయణ రెడ్డి, రఘునాథ్‌పల్లి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి, సిబ్బందిని పోలీస్ కమిషనర్ అభినందించారు.
-
Home
-
Menu
