తగ్గుముఖం పట్టిన ధురంధర్-2 కలెక్షన్లు.. ఇలాగైతే కష్టమే..

రణ్‌వీర్ సింగ్ హీరోగా ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘ధురంధర్: ది రివెంజ్’. గతేడాది డిసెంబర్‌లో వచ్చిన ‘ధురంధర్’ సినిమాకు ఇది సీక్వెల్. మార్చి 19న విడుదలైన ఈ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది. తొలి వారంలోనే రూ.వెయ్యి కోట్లు దాటి రికార్డు నెలకొల్పింది. అయితే ఆ తర్వాత ఈ సినిమా కలెక్షన్లు తగ్గుముఖం పట్టాయి.
ఈ మూవీ విడుదలై రెండు వారాలు దాటింది. 14 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ.1435 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. ధురంధర్ కేవలం హిందీలో రిలీజైనప్పటికీ.. రూ.1300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ సీక్వెల్‌ను హిందీతో పాటు దక్షిణాది భాషల్లోనూ రిలీజ్ చేశారు. అయినప్పటికీ.. వసూళ్ల పరంగా కాస్త జోరు తగ్గినట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం ఉన్న కలెక్షన్ల పరంగా అయితే.. ఈ సినిమా రూ.1500 కోట్ల క్లబ్‌లో చేరడం సులభమే.
కానీ, వసూళ్లు ఇలాగే కొనసాగితే.. పుష్ప-2, బాహుబలి-2 లాంటి టాలీవుడ్ చిత్రాల రికార్డ్స్ దాటడం కష్టంగా అనిపిస్తోంది. ఎందుకంటే ఈ శుక్రవారం కొత్త సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. దీని ప్రభావం దురంధర్‌పై పడే అవకాశాలు ఉన్నాయి. సినిమాపై ఎంత క్రేజ్ ఉన్నా.. రెండో వారానికి సంబంధించి ఆశించిన స్థాయిలో వసూళ్లు రావడం లేదు. మరి ధురంధర్ ఫున్ రన్‌లో ఎంత వసూళ్లు సాధిస్తుందో వేచి చూడాల్సిందే.
-
Home
-
Menu
