పెళ్లి పేరుతో మోసం చేశాడని నటి ఫిర్యాదు..

టాలీవుడ్ యువ దర్శకుడు పవన్ సాధినేని వివాదంలో చిక్కుకున్నారు. ఓ నటి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా హైదరాబాద్ పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చి తనను మోసం చేశారని నటి ఫిర్యాదులో పేర్కొంది. ఈ ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన పోలీసులు పవన్ సాధినేనిని అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. పవన్ సాధినేని ‘ప్రేమ ఇష్క్ కాదల్’ సినిమాతో దర్శకుడిగా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. అనంతరం ‘సావిత్రి’, ‘సేనాపతి’ తదితర
చిత్రాలకు దర్శకత్వం వహించి గుర్తింపు పొందారు. సినిమాలతో పాటు పలు వెబ్‌సిరీస్‌లకు కూడా ఆయన దర్శకత్వం వహించారు. ప్రస్తుతం మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న ‘ఆకాశంలో ఒకతార’ సినిమాకు పవన్ సాధినేని దర్శకత్వం వహిస్తున్నారు. దర్శకుడిగా మంచి గుర్తింపు పొందుతున్న సమయంలో ఆయనపై వచ్చిన ఈ ఆరోపణలు టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారాయి.
-
Home
-
Menu
