ఆ రోజు ప్రభాస్ చాలా బాధపడ్డాడు: వి.వి. వినాయక్

X
టాలీవుడ్ దర్శకుడు వి.వి. వినాయక్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్ గురించి ఆ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఆ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. బాహుబలి మొదటి భాగం విడదలైన తర్వాత చిత్ర బృందం ఓ పార్టీ ఏర్పాటు చేశారని, అందులో డైరెక్టర్ రాజమౌళి, ప్రభాస్ డల్ గా కనిపించారన్నారు. అలా డల్ గా ఉండటానికి గల కారణం బాహుబలి మొదటి భాగం విడుదలైన తర్వాత దానికి నెగిటివ్ టాక్ రావడమే. దాంతో వారిద్దరూ చాలా బాధపడ్డారు. అయితే ఆ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. సినిమా విడుదలైన మొదటి రెండు, మూడు రోజులు నెగిటివ్ టాక్ రావడంతో ఎంతో బాధపడ్డారని, కానీ ఆ తర్వాత సినిమా సక్సెస్ కావడంతో చాలాఆపందపడ్డారని వినాయక్ తెలిపారు.
Next Story
-
Home
-
Menu
