క్వాంటం కంప్యూటింగ్ తోనే అమరావతికి రూపు రేఖలు : చంద్రబాబు

క్వాంటం కంప్యూటింగ్ తోనే అమరావతికి రూపు రేఖలు : చంద్రబాబు
X

అమరావతి: ప్రపంచానికి మనమే క్వాంటం కంప్యూటర్లు అందిస్తామని ఎపి సిఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. ఎఐ, క్వాంటం కంప్యూటర్లు, డేటా సెంటర్లతో పెను మార్పులు వచ్చాయని అన్నారు. సిఎం అధ్యక్షతన మంత్రులు, కార్యదర్శులు, వర్చువల్ గా కలెక్టర్లు, ఎస్సిలు సమావేశం అయ్యారు. జిఎస్ డిపి వృద్ధిరేటు స్వర్ణాంధ్ర 2047 విజన్ లక్ష్యాలపై సిఎం సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎనర్జీపైనా దావోస్ లో ఎఐ టెక్నాలజీ గురించి ప్రధానంగా చర్చించామని, సంక్షేమ పథకాలు క్రమం తప్పకుండా అందుతున్నాయని అన్నారు. హామీల అమలులో ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని, ఎఐ ద్వారా ట్రిలియన్ డాలర్ల ఎకానమీ రానుందని చంద్రబాబు తెలియజేశారు.

అంధకారం నుంచి వ్యవస్థలను కంట్రోల్ లోకి తెచ్చుకున్నామని, మూడేళ్లలో 19 నెలలుగా ఎన్నో కార్యక్రమాలు చేపట్టామని అన్నారు. అమరావతి బెస్ట్ సిటిగా మారుతుందని జోస్యం చెప్పారు. స్త్రీశక్తి పథకం తో 4 కోట్ల 29 లక్షల ఉచిత ప్రయాణాలు పూర్తి చేశామని, దీపం పథకంలో 2 కోట్ల సిలిండర్లు ఇచ్చామని అన్నారు. సూపర్ 6 లో తల్లికి వందనం మాట నిలబెట్టుకున్నామని, క్వాంటం కంప్యూటింగ్ ద్వారా అమరావతికి రూపు రేఖలు మారుతాయని పేర్కొన్నారు. ప్రతి ఒక్క అధికారి ప్రభుత్వ నిర్ణయాలపై పని చేయాలని, ప్రతినెలా అధికారులు సమీక్షలు నిర్వహించాలని చంద్రబాబు నాయుడు సూచించారు.

Tags

Next Story