కాళోజీ కళాక్షేత్రం మేమే పూర్తి చేశాం..అబద్ధమైతే రాజీనామా చేస్తా: నాయని

కాళోజీ కళాక్షేత్రం మేమే పూర్తి చేశాం..అబద్ధమైతే రాజీనామా చేస్తా: నాయని
X

మన తెలంగాణ – వరంగల్: కాళోజీ కళాక్షేత్రం అభివృద్ధిపై చర్చకు సిద్ధమా? అంటూ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి బిఆర్ఎస్ నేతలకు సవాల్ విసిరారు. నిర్మాణాన్ని మధ్యలో వదిలేసిన వారు తామే పూర్తి చేశామని చెప్పడం అబద్ధమని నిరూపిస్తే రాజీనామాకు సిద్ధమా? అంటూ ప్రశ్నించారు.

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ కు దమ్ముంటే వరంగల్ పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని సవాల్ విసిరారు. వరంగల్ అభివృద్ధిపై మాట్లాడే ముందు వాస్తవాలను తెలుసుకోవాలని నాయని సూచించారు.

ఉమ్మడి వరంగల్ జిల్లాకు మరో రెండు మంత్రి పదవులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మంత్రి పదవికి తాను కూడా అర్హుడినేనని, జిల్లా అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారానికి మరింత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందదని నాయిని రాజేందర్ రెడ్డి పేర్కొన్నారు.

Tags

Next Story