జడ్చర్లలో శవాన్ని పీక్కుతిన్న కుక్కలు

జడ్చర్ల: ప్రభుత్వాస్పత్రి మార్చురీలో ఓ మృతదేహాన్ని కుక్కలు పీక్కుతిన్న సంఘటన మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.... నాగసాల గ్రామానికి చెందిన పోలే భీమేశ్వర్ అనే వ్యక్తి లారీ డ్రైవర్ పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. భీమేశ్వర్ చెరువులో పడి అనుమానాస్పదంగా మృతి చెందాడు. దీంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి మృతదేహాన్ని జడ్చర్ల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మార్చురీలో ఉన్న శవాన్ని కుక్కలు పీక్కుతిన్నాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీనిపై ఆస్పత్రి సూపరింటెండెంట్ చంద్రకళ స్పందించారు. సిబ్బంది మార్చురీలోకి వెళ్తుండగా కుక్కలు అందులోనికి వెళ్లాయని వివరణ ఇచ్చాడు. ఈ మధ్యనే 30 పడకల ఆస్పత్రిని వంద పడకల ఆస్పత్రిగా మార్చారు. కానీ మార్చురీలో మాత్రం సదుపాయాలు కల్పించకపోవడంతో పాత మార్చురీనే నిర్వహిస్తున్నారు. మార్చురీలో శవాన్ని తీసుకెళ్లాలంటేన బంధువులు భయపడుతున్నారు.
Tags
-
Home
-
Menu
