అలా జరగకపోతే రెండు రోజుల్లో తేలుస్తాం ఖమేనీ: ట్రంప్

X
టెహ్రాన్: ఇరాన్- అమెరికా మధ్య రోజు రోజుకు పచ్చి గడ్డి వేస్తే బగ్గుమంటోంది. ఇరాన్ పై అమెరికా దాడి చేస్తే పశ్చిమాసియాలో ప్రాంతీయ యుద్ధానికి దారితీస్తుందని ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ హెచ్చరించిన విషయం తెలిసిందే. అమెరికా యుద్ధ నౌకలను రంగంలోకి దించిన తరువాత ఖమేనీ హెచ్చిరించడం ఇదే తొలి సారి. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన నౌకలు ఇరాన్ కు దగ్గరలోనే ఉన్నాయని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తెలిపారు. రెండు రోజుల్లో ఒప్పందం కుదరకపోతే ఖమేనీ చెప్పింది నిజం అవుతుందో కాదో తెలుస్తుందని ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య యుద్ధం నేపథ్యంలో పశ్చిమాసియాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎప్పుడు ఏం జరుగుతోందోనని ఆ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
Next Story
-
Home
-
Menu
