డ్రగ్స్, గంజాయి రహిత తెలంగాణ కోసం తపిద్దాం: పట్నం

drug and marijuana-free Telangana
X

drug and marijuana-free Telangana

హైదరాబాద్: డ్రగ్స్, గంజాయి రహిత తెలంగాణ కోసం తపిద్దామని శాసన మండలిలో ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఘట్ కేసర్ లో నూతనంగా ప్రభుత్వం మంజూరు చేసిన కాప్రా ఆబ్కారీ (ఎక్సైజ్) పోలీస్ స్టేషన్ ను పట్నం మహేందర్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, ఉప్పల్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వజ్రేష్ యాదవ్, మాజీ ఎంఎల్ఎ సుదీర్ రెడ్డి, ఎక్సైజ్ ఇఎస్ నవీన్ కుమార్, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా పట్నం మాట్లాడారు. ఎక్సైజ్ శాఖను మరింత పటిష్టం చేసేందుకు ప్రభుత్వం రాష్ట్రంలో 14 కొత్త పోలీస్ స్టేషన్లను మంజూరు చేసిందని, వీటిలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 9 పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేస్తున్నామన్నారు. మల్కాజ్ గిరి సర్కిల్ కోసం కాప్రా (ఘట్కేసర్), అల్వాల్ (మల్కాజ్ గిరి), ఉప్పల్ (నాచారం), మేడ్చల్ సర్కిల్ పరిధిలో కొంపల్లి (కుత్బుల్లాపూర్), కూకట్పల్లి (బాలనగర్), అలాగే సరూర్నగర్ సర్కిల్ లో మీర్ పేట, పెద్ద అంబర్పేట్, అలాగే శంషాబాద్ సర్కిల్ లో గండిపేట్, కొండాపూర్ లలో కొత్త ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ నందు ఏర్పాటు చేస్తున్నామని మహేందర్ రెడ్డి వివరించారు.

గంజాయి, డ్రగ్స్ రహిత తెలంగాణను సాధించుకుందామని, వీటి నియంత్రించేందుకు డ్రగ్స్ ముఠాలను సమూలంగా నిర్మూలించేందుకు ఎక్సైజ్ వ్యవస్థ మరింత బలోపేతం ఎంతో అవసరమని పట్నం తెలియజేశారు. మద్యం అక్రమ రవాణా, కల్తీ నివారించడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని, గంజాయి డ్రగ్స్ తదితర వాటి నివారణ కోసం ఎక్సైజ్ శాఖ సాయ శక్తుల కృషి చేస్తుందని మహేందర్ రెడ్డి తెలిపారు. కొత్తగా మంజూరైన ఆఖరి స్టేషన్ల భవనాల కోసం స్థలాలు, భవన నిర్మాణం కోసం నిధులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంప్రదించి మంజూరు చేయిస్తామని, విద్యార్థులు యువత మత్తు పదార్థాలు డ్రగ్స్ కు దూరంగా ఉండేందుకు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.

Tags

Next Story