ఎస్‌ఐని కారుతో ఢీకొట్టి.. పారిపోయిన మందుబాబు

ఎస్‌ఐని కారుతో ఢీకొట్టి.. పారిపోయిన మందుబాబు
X

అమరావతి: వాహన తనిఖీలు చేస్తుండగా ఎస్‌ఐని కారుతో ఢీకొట్టి అనంతర మందుబాబు పారిపోయిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురం ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..... అమలాపురంలోని ఆర్‌టిసి బస్టాండ్ సమీపంలో ఎస్‌ఐ కిశోర్ బాబు తన సిబ్బందితో కలిసి వాహనాలను తనిఖీ చేస్తున్నాడు. రాంగ్ రూట్‌లో వస్తున్న కారును ఎస్‌ఐ ఆపేందుకు ప్రయత్నించాడు. ఎస్‌ఐ కాలు పైనుంచి కారు వెళ్లడంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. పెట్రోలి ంగ్ వాహనాన్ని ఢీకొట్టాడు. వెంటనే ఎస్‌ఐని స్థానిక ఆస్పత్రికి తరలించారు. కొంకాపల్లి సమీపంలో కలెక్టర్ బంగ్లా వద్ద కారును పోలీసులు పట్టుకున్నారు. కారు డ్రైవర్ ఫణీంద్ర కుమార్ మద్యం మత్తులో ఉన్నట్టు గుర్తించారు. అతడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

Tags

Next Story