జయశంకర్ భూపాలపల్లిలో అధికారులపైకి దూసుకెళ్లిన టిప్పర్: డిటిఒ మృతి

జయశంకర్ భూపాలపల్లిలో అధికారులపైకి దూసుకెళ్లిన టిప్పర్: డిటిఒ మృతి
X

భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో పరకాల-భూపాలపల్లి హైవేపై రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. డిటిఒ కార్యాలయం ముందు వాహనాలు తనిఖీ చేస్తుండగా అధికారులపైకి బొగ్గు టిప్పర్ దూసుకరావడంతో డిటిఒ వెంకన్న మృతి చెందాడు. వెంకన్న పైనుంచి టిప్పర్ వెళ్లడంతో మృతదేహం నుజ్జు నుజ్జుగా మారింది. డిటిఒ వెంకన్న 15 రోజుల క్రితమే భూపాలపల్లికి బదిలీపై వచ్చారు. పోలీసులు టిప్పర్ డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ట్రాపిక్ కు అంతరాయం లేకుండా టిప్పర్ ను పక్కకు తొలగించారు. మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం భూపాలపల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

Tags

Next Story