జమ్ము కశ్మీర్ లో భూకంపం

X
శ్రీనగర్: జమ్ము కశ్మీర్ రాష్ట్రంలో భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.8గా ఉందని భూపరిశోధన అధికారులు వెల్లడించారు. సోమవారం ఉదయం 5.35 నిమిషాలకు శ్రీనగర్ కు నైరుతి మూలంలో 20 కిలో మీటర్ల దూరంలో బద్గాం జిల్లాలోని సోయిబుగ్ లో భూకంప కేంద్రం ఉందని అధికారులు వెల్లడించారు. భూమి కంపించడంతో ప్రజలు ఇండ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.మళ్లీ భూమి కంపింస్తుందనే భయంతోనే ప్రజలు భయటనే ఉండిపోయారు. ప్రాణ నష్టం, ఆస్తి నష్టం ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. హిమాలయ పర్వతాలలో భూకంపాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉండడంతో జమ్ము కశ్మీర్ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
Next Story
-
Home
-
Menu
