జపాన్ లో 7.2 తీవ్రతతో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు

జపాన్ లో 7.2 తీవ్రతతో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు
X

టోక్యో: జపాన్ లో భారీ భూకంపం సంభవించింది. జపాన్ ఉత్తర తీరంలో సోమవారం 7.2 తీవ్రతతో భారీ భూ ప్రకంపనలు సంభవించినట్లు అధికారులు తెలిపారు. భారీ భూకంపం నేపథ్యంలో మూడు మీటర్ల ఎత్తులో సునామీ వచ్చే అవకాశం ఉందని జపాన్ వాతావరణ సంస్థ హెచ్చరిక జారీ చేసింది. అమోరి, హక్కైడో తీరంలో భూకంపం సంభవించిందని ఏజెన్సీ పేర్కొంది. జపాన్ తీరాన్ని భూకంపం అతలాకుతలం చేయడంతో సీలింగ్ లైట్లు ఊగుతున్నట్లు సోషల్ మీడియా పోస్ట్‌లు వైరల్ అవుతున్నాయి. కాగా, భూకంపం కారణంగా ఇప్పటివరకు ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం గానీ జరగలేదని అధికారులు తెలిపారు.


Tags

Next Story