ఇండోనేషియాలో భారీ భూకంపం.. సునీమీ హెచ్చరికలు జారీ

ఇండోనేషియాలో భారీ భూకంపం.. సునీమీ హెచ్చరికలు జారీ
X

జకార్తా: ఇండోనేషియాలో భారీ భూకంపం సంభవించింది. ఉత్తర సులవేసి ప్రావిన్స్‌లోని తీరప్రాంత నగరమైన బిటుంగ్‌లో 7.4 తీవ్రతతో భారీ భూకంపం సంభవించిందని యూఎస్ జియోలాజికల్ సర్వే (USGS) తెలిపింది. భూకంప కేంద్రానికి 1,000 కిలోమీటర్ల (621 మైళ్ల) పరిధిలో సునామీ అలలు సంభవించే అవకాశం ఉందని ఒక యూఎస్ పర్యవేక్షణ కేంద్రం హెచ్చరిక జారీ చేసింది. నివేదికల ప్రకారం, స్థానిక కాలమానం ప్రకారం గురువారం ఉదయం 6.48 గంటల సమయంలో టెర్నాటే అనే చిన్న ద్వీపానికి సమీపంలో, మొలుక్కా సముద్రంలో 35 కిలోమీటర్ల లోతులో ఈ భూకంపం సంభవించిందని USGS తెలిపింది.

ఈ భూకంపం కారణంగా ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, మలేషియా తీరాల వెంబడి సునామీ అలలు సంభవించే అవకాశం ఉందని హవాయికి చెందిన పసిఫిక్ సునామీ హెచ్చరిక కేంద్రం పేర్కొంది.


Tags

Next Story