నిజామాబాద్ లో రెండు రోజుల్లో పెళ్లి.... నవవరుడు ఆత్మహత్య

X
హైదరాబాద్: నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం మంగళ్‌పాడ్‌లో పెళ్లింట విషాదం నెలకొంది. పెళ్లికి ముందు చెట్టుకు ఉరి వేసుకొని ప్రతాప్(౩౦) ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంట్లో గొడవ జరిగిందన్న మనస్థాపంతో ప్రతాప్ బయటకు వెళ్లాడు. గ్రామ శివారులో చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గ్రామస్థుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story
-
Home
-
Menu
