జలదిగ్బంధంలో ఏడుపాయల

సింగూర్ ప్రాజెక్టు ఎగువన సంగారెడ్డి, మెదక్ జిల్లాలలో కురుస్తున్న భారీ వర్షాలతో మంజీరా నది ఉగ్రరూపం దాల్చింది. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద వస్తుండడంతో, సింగూరు ప్రాజెక్టు నుండి దిగువకు రికార్డు స్థాయిలో 1,24,000 క్యూసెక్కుల నీటిని మంజీరా నదిలోకి విడుదల చేశారు. భారీ ప్రవాహం కారణంగా మంజీరా నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీని ప్రభావంతో వన దుర్గా ప్రాజెక్టు కూడా పొంగిపొర్లుతోంది. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గ భవాని ఆలయం నీట మునిగి, ఏకంగా 43 రోజులుగా జలదిగ్బంధంలోనే ఉంది. తాజాగా శనివారం వరద ప్రవాహం మరింత పెరగడంతో, ఆలయం ముందున్న ప్రసాదం కౌంటర్ పూర్తిగా వరదలో కొట్టుకుపోయింది. ప్రస్తుతం భక్తుల దర్శనం కోసం రాజగోపురంలో ప్రత్యేకంగా అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.
రవాణా, పంట పొలాలపై తీవ్ర ప్రభావం
మంజీరా నది వరద ఉద్ధృతి కారణంగా జనజీవనం తీవ్రంగా దెబ్బతిన్నది. నది పరిసర ప్రాంతాల్లో ఉన్న పంట పొలాలు లక్ష ఇరవై వేల క్యూసెక్కుల నీటి ప్రవాహానికి పూర్తిగా మునిగిపోయాయి. ఏడుపాయల మొదటి బ్రిడ్జి పైనుంచి కూడా వరద నీరు ప్రవహిస్తుందడంతో రాకపోకలు నిలిపివేసిన పోలీస్ సిబ్బంది. ఎల్లాపూర్ బ్రిడ్జిపై కూడా వరద ప్రవాహం పెరగడంతో మెదక్, బోడమటిపల్లి వైపు వెళ్లే ప్రజల రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు ఈ రెండు బ్రిడ్జిలపై వచ్చే ప్రయాణికులు ఇతర ప్రయాణం మార్గాలను ఎంచుకోవాలని అధికారులు సూచించారు.
Tags
-
Home
-
Menu