వికటించిన మధ్యాహ్న భోజనం..8 మంది విద్యార్థులకు అస్వస్థత

వికటించిన మధ్యాహ్న భోజనం..8 మంది విద్యార్థులకు అస్వస్థత
X

కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలంలోని మాల్ తుమ్మెద ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్నా భోజనం వికటించి 8 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వివరాల్లోకి వెళ్తే..మంగళవారం మధ్యాహ్నం పాఠశాలలో 48 మంది విద్యార్థులు ఉండగా మధ్యాహ్నం భోజనం తిన్న వెంటనే కొంతమంది విద్యార్థులు కడుపునొప్పి వస్తోందని, మరికొంతమంది విద్యార్థులు వాంతులు చేసుకున్నారు. ఈ విషయాన్ని గమనించిన పాఠశాల ప్రిన్సిపాల్ లక్ష్మీతులసి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి సమాచారం అందించగా వైద్య బృందం పాఠశాలకు వెళ్లి విద్యార్థులను పరిశీలించి తీవ్ర అస్వస్థకు గురైన ఐదవ తరగతి చదువుతున్న విద్యార్థులు ఆదర్శ ప్రేమ్, రోహిత్, సాయి తేజ, ప్రవీణ్ కుమార్, హేమంత్, 4వ తరగతి విద్యార్థి శశివర్ధన్ తదితర ఎనిమిది మందిని 108 వాహనంలో ఎల్లారెడ్డి ఏరియా ఆసుపత్రికి చికిత్స నిమిత్తం పంపినట్టు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యుడు డాక్టర్ సృజన్ కుమార్ తెలిపారు. కాగా, అస్వస్థతకు గురైన విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. పాఠశాలలో వంటలు చేసే పెద్ద పోచమ్మపై ఆగ్రహం వ్యక్తం చేశారు.


Tags

Next Story