అన్నకు మరణ శాసనం రాసిన తమ్ముడు

చేసిన అప్పులు తీర్చడానికి సొంత అన్నను తమ్ముడు అతికిరాతంగా హతమార్చిన సంఘటన కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలో చోటుచేసుకుంది. వివరాలలోకి వెళితే.. పోలీసుల కథనం ప్రకారం.. రామడుగు మండల కేంద్రానికి చెందిన మామిడి నరేశ్ 3 సంవత్సరాల క్రితం రెండు టిప్పర్ లారీలను కొన్నాడు. వాటిని అద్దెకిస్తుండేవాడు, కాగా కొన్నాళ్లుగా వ్యాపారం సరిగా నడవక ఈఎంఐలు కట్టడానికి అప్పులు చేశాడు. దీంతో పాటు షేర్ మార్కెట్ లోనూ పెట్టుబడి పెట్టి తీవ్రంగా నష్టపోయాడు. దీంతో రూ. 1.50 లక్షల దాకా అప్పులు చేశాడు. అప్పులు ఇచ్చిన వారు ఇబ్బంది పెట్టడంతో తన అన్న మామిడి వెంకటేశ్ ను చంపాలని పథకం వేశాడు. తన అన్నను హత్య చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించబోయి పోలీసులకు దొరికిపోయాడు. రెండు నెలల క్రితం తన అన్న వెంకటేశ్ పేరు మీద రూ.4.14 కోట్లకు బీమా పాలసీ తీసుకున్నాడు. అయితే అదును చూసి అన్నను చంపాలని చూస్తున్నాడు. ఈ నేపధ్యంలో నముండ్ల రాకేష్ నరేష్ ను తనకు ఇవ్వాల్సిన రూ. 7 లక్షలు ఇవ్వాలని ఒత్తిడి చేశాడు. తన అన్నను చంపడానికి సహకరిస్తే రూ.7 లక్షలకు అదనంగా రూ.13 లక్షలు కలిపి మొత్తం రూ.20 లక్షలు ఇసస్తానని రాకేశ్ ను ఒప్పించాడు.
ఇందుకోసం టిప్పర్ డ్రైవర్ ప్రదీప్ ను ఒప్పించారు. ప్రణాళిక ప్రకారం నవంబర్ 29న రాత్రి 11 గంటలకు గ్రామశివారులోని పెట్రోల్ బంక్ పక్కన రోడ్డుపై టిప్పర్ ఆగిపోయిందని డ్రైవర్ ప్రదీప్ నరేశ్ కు ఫోన్ చేసి చెప్పాడు. నరేశ్ తన అల్లుడు సాయి బైక్ పై వెంకటేశ్ ను ఎక్కించి టిప్పర్ వద్దకు పంపించాడు.వాళ్ల వెనకాలే నరేశ్ కూడి వెళ్లాడు. అక్కడకు వెళ్లక ప్రదీప్ వెంకటేశ్ ను టైర్ కింద జాకీ పెట్టమని చెప్పాడు. వెంకటేశ్ జాకీ పెడుతుండగా నరేశ్ టిప్పర్ ను ముందుకు కదిలించాడు. దీంతో వెంకటేశ్ టైర్ కిందపడి సంఘటనా స్ధలంలోనే మృతి చెందాడు. ప్రమాదవశాత్తు జరిగిన ప్రమాదమని పోలీసులను నమ్మించాడానికి డ్రైవర్ ప్రదీప్ ను పారిపోమ్మనాడు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లనే జరిగిందని పోలీసులను నమ్మించాడు. అయితే బీమా సంస్ధకు చెందిన ఉద్యోగులకు నరేశ్ చెప్పె విధానంపై అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు నరేశ్ ను విచారించగా అసలు నిజం బయటపడింది. బీమా సోమ్ము కోసమే తన అన్న వెంకటేశ్ ను చంపానని పోలీసుల ఎదుట నరేశ్ ఒప్పుకున్నాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నరేష్ తో పాటు డ్రైవర్ ప్రదీప్, రాకేష్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.
-
Home
-
Menu
