అప్పు తీర్చమన్నందుకు వృద్ధుడి సజీవదహనం

X
తీసుకున్న అప్పు తీర్చమన్నందుకు వృద్ధుడిని అతి కిరాతంగా హత్య చేసిన సంఘటన ఆంధ్రప్రదేశ్ లోని అల్లూరి సీతరామరాజు జిల్లాలో జరిగింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలలోకి వెళితే.. అల్లూరి జిల్లా పాడేరు మండలం అయినాడ గ్రామపంచాయతీ పరధిలోని చింతలపాలెం గ్రామానికి చెందిన సోమన్న అదే గ్రామానికి చెందిన రామారావుకు రూ. 5.600 నగదు అప్పుగా ఇచ్చాడు. ఈ క్రమంలో సోమన్న రామారావును అప్పుగా ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరగా ఆగ్రహించిన రామారావు సోమన్నపై దాడి చేసి ఇంటికి నిప్పంటించాడు. ఈ ఘటనలో సోమన్న సజీవదహనమయ్యాడు.స్థానికుల ఫిర్యాదు మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు రామారావుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Next Story
-
Home
-
Menu
