ఓలా ఎలక్ట్రిక్ బైక్ షోరూంలో అగ్నిప్రమాదం.. 10 బైకులు దగ్ధం !

ఓలా ఎలక్ట్రిక్ బైక్ షోరూంలో అగ్నిప్రమాదం.. 10 బైకులు దగ్ధం !
X

హైదరాబాద్: ఖమ్మం నగరంలోని రోటరీ నగర్ ప్రాంతంలో ఓలా ఎలక్ట్రిక్ బైక్ షోరూంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో సుమారు రూ. 10 లక్షల విలువైన ఎలక్ట్రిక్ బైకులు మంటల్లో కాలిపోయాయని షోరూం యాజమాన్యం వెల్లడించింది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది, పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ అగ్నిప్రమాదంలో రెండు బైకులు పూర్తిగా దగ్ధం కాగా, మరో ఎనిమిది బైకులు పాక్షికంగా దెబ్బతిన్నాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని.. దర్యాప్తు చేస్తున్నారు.

Tags

Next Story