మేడారంలో కుప్పకూలిన హోర్డింగ్

మేడారంలో కుప్పకూలిన హోర్డింగ్
X

మేడారం అమ్మవార్ల గద్దెల ప్రాంతంలో హరిత హోటల్ వద్ద ఏర్పాటు చేసిన స్క్రీన్ హోర్డింగ్ శుక్రవారం మధ్యాహ్నం కుప్పకూలింది. మేడారం మహా జాతర సందర్భంగా గత కొద్ది రోజుల క్రితమే హరిత హోటల్ వనదేవతల గద్దెలవద్ద జరుగుతున్న విశేషాలను, ప్రచారాలను భక్తులు వీక్షించేందుకు వీలుగా పెద్ద సైజులో స్క్రీన్ ఏర్పాటు చేశారు. అది హఠాత్తుగా కూలిం. ఆ సమయంలో భక్తులు ఎక్కువగా లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది. ఇద్దరు భక్తులకు గాయపడటంతో ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ సంఘటన స్థలానికి చేరుకొని, కూలిన హోర్డింగ్‌ను పరిశీలించారు. జేసీబీ సాయంతో హోర్డింగును తొలగించారు.

Tags

Next Story