బిటెక్ విద్యార్థిని ఆత్మహత్య

ఎల్కతుర్తి: బిటెక్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న సంఘటన హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... గోపాల్ పూర్ గ్రామంలో కృష్ణాకర్ అనే వ్యక్తి తన భార్య ఇద్దరు కుమార్తెలు, కుమారుడితో కలిసి జీవనం సాగిస్తున్నాడు. జె కీర్తన బిటెక్ కాలేజీలో ఫస్ట్ ఇయర్ చదువుతోంది. బిటెక్‌లో పాఠాలు అర్థం కావడంలేదని, తల్లిదండ్రులకు దూరంగా ఉండలేకపోతున్నానని పలుమార్లు తల్లికి ఫోన్ చేసి బాధను వ్యక్తి చేసింది. కూతురును ఇంటికి రప్పించే వేరే కాలేజీలో చేర్పించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. శుక్రవారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని చనిపోయింది. తండ్రి ఇంట్లోకి వెళ్లి చూడగా ఆమె తాడుకు వెలాడుతూ కనిపించింది. ఆర్‌ఎంపి వైద్యుడి సాయంతో పరీక్షించగా అప్పటికే మరణించిందని తెలిపారు. తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
-
Home
-
Menu
