విషాదం.. ఉరివేసుకుని ఇంజనీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య

తెలంగాణలో విద్యార్థుల ఆత్మహత్యలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. తాజాగా రాష్ట్రంలో మరో విద్యార్థిని ప్రాణాలు తీసుకుంది. ఈ విషాద సంఘటనల మేడ్చల్ జిల్లాలో చేటుచేసుకుంది. మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని సిద్దార్థ ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థిని ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలంలోని సనుగుల గ్రామానికి చెందిన నందిని అనే విద్యార్థిని.. నారపల్లిలోని ఓ ప్రైవేట్ హాస్టల్‌లో ఉంటూ.. సిద్దార్థ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతోంది.
అయితే, గురువారం హాస్టల్ లోని తన గదిలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై హాస్టల్ యజమాని సమాచారం మేరకు మేడిపల్లి పోలీసులు.. సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు.మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. హాస్టల్ యజమాని ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నందిని ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
-
Home
-
Menu
