కాంగ్రెస్ ఉండేది మరో ఏడాదే: ఎర్రబెల్లి దయాకరావు

కాంగ్రెస్ ఉండేది మరో ఏడాదే: ఎర్రబెల్లి దయాకరావు
X

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క సంవత్సరం మాత్రమే ఉంటుందని, ఆ తర్వాత వచ్చేది బిఆర్‌ఎస్ సర్కారేనని మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకరావు సంచనల వ్యాఖ్యలు చేశారు. జనగామ ఎంఎల్‌ఎ పల్లా రాజేశ్వర్‌రెడ్డి అధ్యక్షతన మంగళవారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన పార్టీ తరఫున గెలిచిన ‘నూతన సర్పంచ్‌ల అభినందన సభ’లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ..అధికార పార్టీ నాయకులు తమ పార్టీ నాయకులపై అక్రమ కేసులు పెడుతున్నారని, కానీ ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని, తామంతా మీ వెంట ఉంటామని భరోసా ఇచ్చారు. పార్టీలో మేమంతా కలిసి పనిచేస్తున్నామని, తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని, తగాదాలు లేవని స్పష్టం చేశారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో జిల్లాలోని నాలుగు స్థానాలను గెలిపించి పార్టీ అధినేత , మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ చేతుల్లో పెడతామని, ఇందుకు కార్యకర్తలు, నేతలు సమన్వయంతో కష్టించి పనిచేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన 420 హామీలను నెరవేర్చకుండా పచ్చి అబద్ధాలతో మోసం చేస్తోందని ధ్వజమెత్తారు. జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో మెజారిటీ సర్పంచులను గెలిపించినందుకు కార్యకర్తలను అభినందించారు.

Tags

Next Story