ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య మృతి.... సంతాపం తెలిపిన రేవంత్

నిజామాబాద్: గంజాయి ముఠా దాడిలో గాయపడిన ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య మృతి చెందారు. నిజామాబాద్‌లో గంజాయి ముఠాని అడ్డుకునే క్రమంలో కారు దాడిలో సౌమ్య గాయపడిన విషయం తెలిసిందే. నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం రాత్రి 9.41 గంటలకు సౌమ్య మృతి చెందారని నిమ్స్ వైద్యులు తెలిపారు. కానిస్టేబుల్ సౌమ్య మృతిపట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంత్రి వ్యక్తం చేశారు. సంతాపం తెలపడంతో పాటు ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. దీంతో ఆమె కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్‌లో విషాదం నెలకొంది.
గత శుక్రవారం నిజామాబాద్‌లో గంజాయి ముఠా బరి తెగించింది. ఎక్సైజ్ సిఐ స్వప్న తన సిబ్బందితో కలిసి గంజాయి బ్యాచ్‌ను పట్టుకోవడానికి ప్రయత్నించారు. కానిస్టేబుల్ సౌమ్యను గంజాయి బ్యాచ్ సోహెల్, రాహిల్, మతిన్‌తో మరొకరు కారుతో ఢీకొట్టడంతో ఆమె తీవ్రంగా గాయపడింది. వెంటనే నిజామాబాద్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడంతో నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం రాత్రి సౌమ్య మరణించారు.
-
Home
-
Menu
