అగ్ని ప్రమాదంపై తరువాత వివరాలు వెల్లడిస్తాం: శిఖాగోయల్

అగ్ని ప్రమాదంపై తరువాత వివరాలు వెల్లడిస్తాం: శిఖాగోయల్
X

హైదరాబాద్: నాంపల్లి లో జరిగిన అగ్నిప్రమాదంపై ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్, ట్రైనింగ్ హాల్ కు, లైబ్రరీ, హెచ్ఆర్ డి రూమ్ కు మంటలు వ్యాపించాయని డైరెక్టర్ శిఖాగోయల్ తెలిపారు. ఎఫ్ఎస్ఎల్ లో అగ్ని ప్రమాదంపై పోలీసులకు ఫిర్యాదు చేశామని అన్నారు. ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్ అగ్నిప్రమాదంపై శిఖాగోయల్ మీడియాతో మాట్లాడారు. శనివారం 10.08 గం.లకు అగ్నిప్రమాదం జరిగిందని, ఫైర్ సిబ్బంది మధ్యాహ్నం 1.30 గం.లకు మంటలు ఆర్పేశారని అన్నారు. ప్రమాదానికి కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని, జరిగిన నష్టంపై అధికారులు అంచనాలు రూపొందిస్తున్నారని తెలియజేశారు. అగ్ని ప్రమాదంపై కొందరు అసత్యాలు, రెండు కీలక కేసుల్లోని ఆధారాలు కాలిపోయాయని దుష్ప్రచారం ప్రచారం చేస్తున్నారని, అగ్ని ప్రమాదంపై అంచనాలకు వచ్చాక వివరాలు వెల్లడిస్తామని శిఖాగోయల్ పేర్కొన్నారు.

కీలకమైన కేసులకు సంబంధించిన సామగ్రిని గతంలోనే కోర్టుకు అప్పగించామని, 2015 నాటి ఎసిబి కేసు విషయంలో దుష్ప్రచారం జరుగుతోందని విమర్శించారు. 2015 నాటి ఎసిబి కేసుకు సంబంధించిన ఏ సామగ్రి తమ వద్ద లేదని, పంజాగుట్ట పిఎస్ లో నమోదైన కేసులోనూ ఆధారాలు కోర్టుకు ఇచ్చామని అన్నారు. 2024 వరకు సేకరించిన 136 ఆధారాల్లో 7 మినహా అన్నీ కోర్టుకు ఇచ్చేశామని, పలు పరికరాలు పరిశీలించి వెంటనే కోర్టుకు నివేదికలు ఇచ్చామని అన్నారు. చాలా సమాచారాన్ని ఎఫ్ఎస్ఎల్ సురక్షితంగా పునరుద్ధరిస్తుందని, ఏదైనా జరిగితే ఎస్ఎఫ్ఎల్ టీమ్ సమాచారాన్ని పునరుద్ధరిస్తుందని శిఖాగోయల్ స్పష్టం చేశారు.

Tags

Next Story