ప్రమాదవశాత్తు పేలిన రైస్ మిల్లు బాయిలర్

పెద్దపల్లి జిల్లా, సుల్తానాబాద్ మండలం, కాట్నపల్లి గ్రామ శివారులోని కనకదుర్గ రైస్‌మిల్లులో బుధవారం ఉదయం ప్రమాదవశాత్తు బాయిలర్ పేలింది. ఈ ఘటనలో మిల్లులో పనిచేసే ఇద్దరు కార్మికులకు గాయాలయ్యాయి. వీరిలో ఒకరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. వివరాల్లోకి వెళితే.. రైస్ మిల్లులో గంగారపు కుమార్, రామస్వామి అనే ఇద్దరు కార్మికులు పనిచేస్తుండగా ఒక్కసారిగా బాయిలర్ పేలుడు సంభవించింది. దీంతో రామస్వామి, కుమార్‌కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తీసుకువెళ్లి చికిత్స చేయించారు. క్షతగాత్రుల్లో గంగారపు కుమార్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఇదిలావుండగా, బాయిలర్ పేలడంతో దాదాపు రెండు కోట్ల నష్టం వాటిల్లినట్టు రైస్ మిల్లు యజమాని మోరపల్లి తిరుపతిరెడ్డి తెలిపారు.స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
-
Home
-
Menu
