మంచిర్యాలలో చెత్తను కాలుస్తుండగా పేలుడు... మహిళకు తీవ్ర గాయాలు

మంచిర్యాలలో చెత్తను కాలుస్తుండగా పేలుడు...  మహిళకు తీవ్ర గాయాలు
X

మన తెలంగాణ/ కాసిపేట: చెత్తను కాలబెడుతుండగా అందులో ఉన్న పేలుడు పదార్థం పేలి మహిళ తీవ్రంగా గాయపడింది. ఈ సంఘటన మంచిర్యాల జిల్లా కాసిసేట మండలంలో జరిగింది. చుట్టుప్రక్కల వారి కథనం ప్రకారం. సోమ గూడెం ట్యాంక్ బస్తీలో ధనలక్ష్మి అనే మహిళ తన ఇంటి ముందు చెత్తను కాలబెడుతున్న సమయంలో ఒక్కసారి గా పేలుడు సంభవించడంతో ధనలక్ష్మికి తీవ్రంగా గాయపడ్డారు. ధనలక్ష్మి ఎడమ చేయి మణికట్టు వరకు తెగిపోగా కుడి చేతి వేల్లు తెగిపోయాయి. అలాగే కాళ్లు పాదాలు కళ్ళ క్రింద ముఖంపై తీవ్ర గాయాలయ్యాయి. చెత్తను కాలబెడుతున్న సమయంలో ఒక్కసారిగా బాంబు పేలిన శబ్దం వచ్చిందని చుట్టుప్రక్కల వారు తెలిపారు. చెత్తలో ఏదైనా పేలుడు పదార్థం ఉందనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ధనలక్ష్మి చెత్తను ఒక్కచోట పోగు చేసి మంట పెట్టగా ప్రమాదం చోటు చేసుకున్నట్లు సమాచారం. ధనలక్ష్మి తన ఇంటి ముందు చెత్తకు మంట పెట్టిన వెంటనే భారీ శబ్దం వినిపించిందని ఇరుగుపొరుగువారు తెలిపారు. ఇండ్ల బయటకు వచ్చేసరికి ధనలక్ష్మి తీవ్రంగా గాయపడ్డారన్నారు. వెంటనే 108 అంబులెన్స్ కు సమాచారం అందించడం జరిగిందన్నారు. వెంటనే ఆటోలో తరలిస్తుండగా ట్యాంకు బస్తీ వద్ద 108 అంబులెన్స్ రావడంతో సదరు మహిళను అంబులెన్స్ లో ఎక్కించడం జరిగిందన్నారు. అంబులెన్స్ సిబ్బంది ఆత్మరామ్, పైలెట్ కొమరయ్య లు ప్రథమ చికిత్స చేయడం జరిగింది. ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది.

Tags

Next Story