శ్రీవిష్ణు 'ఫ్యామిలీ ప్యాక్' టీజర్ వచ్చేసింది.. సంక్రాంతికి నవ్వుల విందు

ఇటీవల కామ్రేడ్ కళ్యాణ్ సినిమాతో హిట్ కొట్టిన యంగ్ హీరో శ్రీవిష్ణు.. వరుస సినిమాలు చేస్తూ మంచి జోష్ లో దూసుకుపోతున్నాడు. తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ సంపాదించుకున్న శ్రీవిష్ణు మరోసారి కడుపుబ్బ నవ్వించేందుకు రాబోతున్నాడు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న ఫ్యామిలీ ప్యాక్ మూవీ నుంచి మేకర్స్ టీజర్ ను వదిలారు. ఈ టీజర్ ఆద్యంతం నవ్వులు పూయించేలా ఉంది.
ఇందులో శ్రీవిష్ణు, నరేష్ కామెడీ టైమింగ్ అదిరిపోయింది. ఈ టీజర్ సినిమాపై అంచనాలు పెంచేసింది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. రామ్ అబ్బరాజు దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో శ్రీవిష్ణుకు జోడీగా సాక్షి మడోల్కర్ నటిస్తోంది. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 14 విడుదల చేయనున్నట్లు మేకర్స్ టీజర్ వెల్లడించారు.
-
Home
-
Menu
