అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
X

సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని రగుడుకు చెందిన రైతు బైకని ప్రభాకర్ (38) అప్పుల బాధతో శుక్రవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శుక్రవారం పురుగుల మందు తాగడంతో ఆస్పత్రిపాలై చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. వివరాలలోకి వెళితే.. రగుడుకు చెందిన ప్రభాకర్ పదెకరాల పొలం కౌలుకు తీసుకుని వరి పంట వేశాడు. కొద్దినెలల క్రితం కురిసిన వడగండ్ల వానతో కోతకు వచ్చిన పంట నష్టపోయాడు. దీంతో తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. అప్పులపాలైన ప్రభాకర్.. శుక్రవారం తను కౌలుకు తీసుకున్న పొలం వద్ద పురుగుల మందు త్రాగాడు. బంధువులకు తాను విషం తాగిన సమాచారం ఇవ్వడంతో.. అతన్ని సిరిసిల్లకు, అక్కడి నుంచి ఎల్లారెడ్డిపేటకు తరలించారు. చికిత్స పొందుతూ ప్రభాకర్ శనివారం మృతి చెందాడు. మృతునికి భార్య, ఇద్దరు కుమారు లున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు సాగిస్తున్నారు.



Tags

Next Story