పొలంలో విద్యుత్ షాక్ తో రైతు మృతి

పొలంలో విద్యుత్ షాక్ తో రైతు మృతి
X
ప్రమాదవశాత్తూ విద్యుత్ షాక్‌తో రైతు మృతి చెందిన సంఘటన సూర్యాపేట జిల్లా, పెన్‌పహాడ్ మండల పరిధిలోని అనాజిపురం గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది

ప్రమాదవశాత్తూ విద్యుత్ షాక్‌తో రైతు మృతి చెందిన సంఘటన సూర్యాపేట జిల్లా, పెన్‌పహాడ్ మండల పరిధిలోని అనాజిపురం గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన రైతు దూబగాని లక్ష్మయ్య (35) తన సొంత వ్యవసాయ పొలంలో పనిచేస్తూ మోటార్ నడవకపోవడంతో విద్యుత్ వైర్లు సరిచేస్తున్నాడు. పొలంలో మోటార్ కేబుల్ వైర్ అప్పటికే తెగిపడి ఉండడాన్ని గమనించక ఆయన తీగపై ప్రమాదవశాత్తు కాలు మోపడంతో విద్యుత్ సరఫరా జరిగి షాక్ కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య, కుమారుడు ఉన్నారు. అందరితో కలివిడిగా ఉండే లక్ష్మయ్య మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Tags

Next Story