అన్నదాత కష్టాలు..

అన్నదాత కష్టాలు..
X

అన్నతదాత సుఖీభవ కష్టాలు తొలగడం లేదు.ఆరుగాలం కష్టించి పంటలు పండించిన రైతన్నలకు అడుగడుగునా కష్టాలు వెంటాడుతున్నాయి. ప్రకృతి ప్రకోపంతో పంటలకు నష్టం కలుగుతుంది. ములుగు జిల్లా మాజేడు మండలం పడిగాపురం గ్రామ శివారులో మిరప సాగు చేస్తున్న రైతుల కష్టాలకు సజీవ సాక్ష్యం ఈ చిత్రం. పొలాల మధ్య ఉన్న ట్రాన్స్ ఫార్మర్ కాలిపోయింది. దీంతో రైతులు విద్యుత్ అధికారులను సంప్రదిస్తే ములుగు లేదా రేగొండ తీసుకొళ్లాలని తెలిపారు. పొలాల మధ్య ఉన్న ట్రాన్స్ ఫార్మర్ వద్దకు ట్రాక్టర్ వెళ్లడానికి బాట లేక పోవడంతో రైతులు ఎడ్లబండిని కిరాయికి తీసుకొని దానిమీద ట్రాన్స్ ఫార్మర్ పెట్టి, బండికి తాళ్లతో కట్టి.. మోకాలి లోతు బురదలో బండిని లాగుతూ అరకిలో మీటరు దూరం ఉన్న రోడ్డు మీదకు తీసుకెళ్లారు. అక్కడి నుంచి ట్రాక్టర్ పై రేగొండకు తీసుకెళ్ళారు.

Tags

Next Story