వరంగల్ లో తండ్రి, కూతురు సజీవదహనం

X
హనుమకొండ: అనుమానాస్పద స్థితిలో మంటల్లో కాలిపోయి తండ్రి, కూతురు మృతి చెందిన సంఘటన హనుమకొండ జిల్లా కాజీపేట మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కడిపికొండ రాజీవ్ గృహకల్పలో తండ్రి రాజశేఖర్(54) కూతురు రాజశ్రీ, అల్లుడు నివాసం ఉంటున్నాడు. బుధవారం తెల్లవారుజామున తండ్రి రాజశేఖర్ మంటల్లో కాలిపోతున్నాడు. కూతరు మంటలార్పాడినికి వెళ్లి ఆమె కూడా కాలిపోయింది. వెంటనే అల్లుడు ఇంట్లో నుంచి బయటకు వచ్చి కేకలు వేశాడు. ఇద్దరు తీవ్ర గాయాలతో చనిపోయారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరి మృతిపై అనుమానాలు ఉన్నట్టు సమాచారం.
Next Story
-
Home
-
Menu
