గద్వాల్‌లో కోడలిపై మామ గొడ్డలితో దాడి

గద్వాల: కోడలిని మామ గొడ్డలితో దాడి చేసిన సంఘటన జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... చాగదోణ గ్రామంలో జాన్, రీటా అనే దంపతులు నివసిసతున్నారు. ఈ దంపతులకు వివాహం జరిగి ఐదు సంవత్సరాలైన పిల్లలు కాకపోవడంతో మామ తిమ్మప్ప పలుమార్లు కోడలను వేధించేవాడు. రోజు రోజు మామ తిమ్మప్ప వేధింపులు ఎక్కువ కావడంతో తన పుట్టింటికి వెళ్లిపోయింది. పెద్దలు సర్ధి చెప్పడంతో మళ్లీ అత్తగారింటికి వచ్చింది. కుమారుడు, కోడలిని ఇటుక బట్టీల పనికి పంపిస్తానని తిమ్మప్ప లక్ష రూపాయలు అడ్వాన్స్‌గా తీసుకున్నాడు. పనికి వెళ్లకుండా తిమ్మప్ప డబ్బులు తీసుకొని మద్యం సేవిస్తూ ఎంజాయ్ చేస్తుండడంతో అతడిని ప్రశ్నించింది. కోపంతో కోడలిని తిమ్మప్ప గొడ్డలితో దాడి చేశారు. తలపై బలమైన గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. అయిజ ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స చేసిన అనంతరం మెరుగైన వైద్యం కోసం కర్నూలులోని జిజిహెచ్ ఆస్పత్రికి తరలించారు. కొయ్య తిమ్మప్పపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Tags
-
Home
-
Menu
