కేవలం రూ.500 కోసం కన్నతండ్రిని చంపిన కొడుకు

కేవలం రూ.500 కోసం కన్నతండ్రిని చంపిన కొడుకు
X

కేవలం రూ.500 ఇవ్వలేదన్న కోపంతో కన్న తండ్రిని గొంతుకోసి కొడుకు దారుణంగా హత్య చేసిన సంఘటన సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణ పరిధిలోని అల్లిపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. అల్లిపూర్ గ్రామానికి చెందిన పిచ్చకుంట్ల తుకారం(35) తండ్రి పిచ్చకుంట్ల శంకర్(70) ని బుధవారం రాత్రి రూ.500 ఇవ్వాలని అడగగా తండ్రి ఇవ్వలేదు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి క్షనికావేశంలో తుకారం తండ్రిని కత్తితో గొంతు కోశాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన శంకర్ అక్కడికక్కడే మృతి చెందాడు.స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Tags

Next Story