మహిళా దినోత్సవం... కామారెడ్డిలో ముగ్గురు కూతుళ్లను చెరువులోకి తోసేసిన తండ్రి... మృతి

మహిళా దినోత్సవం... కామారెడ్డిలో ముగ్గురు కూతుళ్లను చెరువులోకి తోసేసిన తండ్రి... మృతి
X

కామారెడ్డిలో దారుణం వెలుగులోకి వచ్చింది. మహిళ దినోత్సవానికి ముందు రోజే పోషించే స్థోమత లేక ముగ్గురు కూతుళ్లను తండ్రి చెరువులోకి తోసేశాడు. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా మరొకరు గల్లంతయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కామారెడ్డి పట్టణం ఆర్పీ నగర్ ప్రాంతంలో ఇస్మాయిల్–షబీనా అనే భార్యభర్తలు నివసిస్తున్నారు. ఈ దంపతులకు ముగ్గురు కూతుళ్లు షీపత్(8), ఆయత్(7), మరియమ్(5)లు ఉన్నారు. ఇస్మాయిల్ ఆటో నడుపుతూ, షబీనా కూలీ పనులు చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. శనివారం కూలీ పనులకు వెళ్లి తిరిగి వచ్చాక పిల్లలు కనిపించకపోవడంతో భర్తతో కలిసి పోలీసులకు షబీనా ఫిర్యాదు చేసింది.

పిల్లలకు దోశ తినిపించేందుకు తీసుకెళ్లాలని, ఆటో గిరాకీ రావడంతో వారిని ఇంటికి వెళ్లమని చెప్పి తాను వెళ్లిపోయానని విచారణలో పోలీసులకు తండ్రి వివరించాడు. సిసిటివి దృశ్యాలకు, ఇస్మాయిల్ సమాధానాలకు పొంతన లేకపోవడంతో అతడిని పోలీసులు అదుపులోకి తీసుకొని తనదైన శైలిలో ప్రశ్నించడంతో ముగ్గురు పిల్లలను పెద్ద చెరువులో తోసేశానని చెప్పాడు. వారంతా చనిపోయారని నిర్ధారించుకునేందుకు అరగంట సేపు అక్కడే ఉన్నానని తండ్రి ఒప్పుకున్నాడు. వెంటనే పోలీసులు సహాయక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. ఇద్దరు చిన్నారుల మృతదేహాలను వెలికితీశామని, మరో చిన్నారి మృతదేహం కోసం గాలిస్తున్నామని వెల్లడించారు. తండ్రిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించామని చెప్పారు. ఈ కేసులో తల్లి పాత్ర ఉందా? అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

Tags

Next Story