రెండో భార్యతో కలిసి పిల్లలను చంపడానికి ప్రయత్నించిన తండ్రి

రెండో భార్యతో కలిసి పిల్లలను చంపడానికి ప్రయత్నించిన తండ్రి
X

విషం కలిపిన బిస్కెట్లతో సొంత పిల్లలను చంపేందుకు తండ్రి, అతని రెండో భార్య ప్రయత్నించారు. ఈ ఘటన జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం పొట్టిగుబ్బడి తండాలో చోటుచేసుకుంది. వివరాలలోకి వెళితే.. పోలీసుల కథనం ప్రకారం.. అనిత తరిగొప్పుల మండలం ఆంక్షాపూర్ గ్రామానికి చెందినది. తన ఇద్దరి కుమారులతో కలిసి జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం పొట్టిగుబ్బడి తండాలో నివసిస్తున్నది. అయితే అనిత భర్త శ్రీనివాస్ సంవత్సరం కిత్రం ముడావత్ మమతను రెండో వివాహం చేసుకున్నాడు. ఈ క్రమంలో అనిత పోలీస్టేషన్ లో ఫిర్యాదు చేయగా పెద్దమనుషుల సమక్షంలో పిల్లల పేరిట 20 గుంటల భూమిని రిజిస్ట్రేషన్ చేయిస్తానని భర్త శ్రీనివాస్ ఒప్పుకున్నాడు.పిల్లలను చూసుకుంటూ , భూమిని సాగు చేసుకుంటూ,

అప్పుడప్పుడు కూలి పనులకు వెళ్తూ అనిత జీవనం సాగిస్తుండగా ఈ మధ్య తన భూమి తనకు ఇవ్వాలని అనితను శ్రీనివాస్ వేధించడం ప్రారంభించాడు. మరోసారి పోలీసులను ఆశ్రయించిన అనిత ఫిర్యాదుతో, శ్రీనివాస్ భూమిని దక్కించుకోవాలనే కక్షతో పిల్లలను హత్య చేసేందుకు పథకం రచించాడు. ఇందుకోసం రెండో భార్య మమత సహాయం తీసుకున్నాడు.స్కల్ కు వెళ్తున్న పిల్లలకు విషం కలిపిన బిస్కెట్లను తినిపినించాలని ఓ వ్యక్తి సుపారీ ఇచ్చాడు. అయితే ఆ విషయం సుపారీ తీసుకున్న వ్యక్తి అనితకు చెప్పాడు.దీంతో అనిత పోలీసులకు ఫిర్యాదు చేసింది. అనిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు శ్రీనివాస్‌తో పాటు అతని రెండో భార్య మమతను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

Tags

Next Story