నిజామాబాద్‌లో గంజాయి బ్యాచ్ హల్‌చల్... మహిళా కానిస్టేబుల్‌ను కారుతో ఢీకొట్టి

X
నిజామాబాద్ జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో గంజాయి బ్యాచ్ హల్‌చల్ చేసింది. ఎక్సైజ్ సిబ్బంది అర్థరాత్రి తనిఖీలు చేస్తుండగా గంజాయి బ్యాచ్ కారుతో వారిని ఢీకొట్టారు. దీంతో మహిళా కానిస్టేబుల్ గాజుల సౌమ్య తీవ్రంగా గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. ఆమె రెండు కిడ్నీలు దెబ్బతిన్నాయని పరీక్షించిన వైద్యులు తెలిపారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. పోలీసులు గంజాయి స్మగ్లర్ల కారును వెంబడించి పట్టుకున్నారు. కారులో రెండు కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. నిందితులు నిర్మల్ జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి వారిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
Next Story
-
Home
-
Menu
