జ్వరం @ రూ.9900... నేను రాను బిడ్డో కార్పొరేట్ ఆస్పత్రికి

చెన్నై లో ఓ వ్యక్తి జ్వరం వచ్చిందని అపోలో క్లినిక్ వెళ్లాడట అక్కడ అతనికి రక్త పరీక్షలు, మూత్ర పరీక్షలు, స్వాబ్ మరియు మిగతా పరీక్షలు చేసి మందులు 900 రూపాయలు తో కలిపి 9 వేల రూపాయలు బిల్లు వేశారు. అని ఇది అవసరమా? అని పెరిగిన హెల్త్ కేర్ ఖర్చుల గురించి అతను సోషల్ మీడియా వేదికగా వాపోయారు..
చాలా మటుకు జ్వరాలు వైరల్ ఫీవర్ ఉంటాయి, లేదా ఏదైనా రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ కానీ లేక యూరినరీ ఇన్ఫెక్షన్ కానీ ఉంటాయి. వైరల్ జ్వరాలు పారాసిటమాల్ మరియు సెట్రిజిన్ వేసుకుంటే తగ్గిపోతాయి. అదే దగ్గు లాంటిది లేక యూరిన్ మంట లాంటివి ఉంటే ఇక్కడ సిప్రోఫ్లాక్ససిన్ లాంటిది యాంటీబయాటిక్ వేసుకోవాలి.
కానీ వైద్యుల దగ్గరికి వెళ్ళితే వారు కంప్లీట్ బ్లడ్ పిక్చర్, యూరిన్ ఇన్ఫెక్షన్ ఉన్నదా అని యూరిన్ టెస్ట్ చేస్తారు. మలేరియా డెంగు లాంటి జ్వరాలు ఉన్నాయా అని కూడా పరీక్ష చేయాల్సిందే. ఇంకా లివర్ ఫంక్షన్ టెస్టులు మరియు అల్ట్రాసౌండ్ పరీక్ష చేస్తారు. ఇది మినిమం పరీక్షలు దీనికి 5వేల రూపాయల కచ్చితంగా అయిపోతాయి. ఎందుకు? ఏమిటి? ఎలా? అనే మోడ్రన్ వైద్య పరీక్షలో ఇది నిర్ధారించడం కోసం ఒకదానిని ఒకటి ఎలిమినేట్ చేయడం అనేది కంపల్సరీ. ఈ విధానం లో తప్పదు.
కావున మనము అత్యవసరం అయితేనే పెద్ద ఆసుపత్రికి వెళ్ళాలి లేదంటే మన ఫ్యామిలీ డాక్టర్ తో చూపించుకోవాలి. వైద్యం ఇండస్ట్రీ అయిపోయి కన్జ్యూమర్ పరిధిలోకి డాక్టర్ వచ్చి పేషెంట్ కన్జ్యూమర్ అయిన తర్వాత పరీక్షలు అనేది తప్పనిసరిగా మారింది. చిన్న పామునైన పెద్ద కర్రతో కొట్టాలి అనే విధంగా ఈ వైద్యం ఉంటుంది. ఒక్కోసారి పెద్ద జబ్బులు కూడా పరీక్షలలో బయటపడతాయి. ఇంకా ఎక్కువ పరీక్షలు కూడా చేయాల్సి వస్తాయి సిటీ స్కాన్ లాంటివి అవసరం అవుతాయి.
మీరేమంటారు?
డాక్టర్ చింతా ప్రభాకర్ రెడ్డి ఎంఎస్ ఎంసిహెచ్
గుండె, ఊపిరితిత్తుల శస్త్రచికిత్స నిపుణులు
ప్రభుత్వ సర్వజన వైద్యశాల కర్నూలు
Tags
-
Home
-
Menu
