క్రేజీ లవ్ స్టోరీ

క్రేజీ లవ్ స్టోరీ
X

వరుస బ్లాక్‌బస్టర్ విజయాలతో అలరిస్తున్న ప్రదీప్ రంగనాథన్ హీరోగా, విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో రూపొందిన క్రేజీ లవ్ స్టోరీ ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’. ఈ చిత్రాన్ని నయనతార నిర్మించగా, కృతి శెట్టి హీరోయిన్‌గా నటించారు. ఈ చిత్రంలో ఎస్.జె. సూర్య, యోగి బాబు కీలక పాత్రలు పోషించారు. హీరో రానా దగ్గుబాటి ఈ సినిమా తెలుగు టీజర్‌ను లాంచ్ చేశారు. ప్రపంచం ఎక్కడికో వెళ్లిపోయింది, మనం ఇప్పుడు 2040లో ఉన్నాం. కానీ ఒకడు లేని ఒక విషయాన్ని ఉందని అంటున్నాడు... అనే వాయిస్‌తో ప్రారంభమైన టీజర్ క్రేజీగా ఆకట్టుకుంది. ప్రదీప్ రంగనాథన్ ఎంట్రీ, కృతి శెట్టిని వర్షంలో కలిసే సన్నివేశం-, ఇద్దరి మధ్య కెమిస్ట్రీ చాలా ఫ్రెష్‌గా కనిపించింది. దర్శకుడు విఘ్నేష్ శివన్ ఈ క్రేజీ లవ్ స్టోరీని అద్భుతంగా తెరకెక్కించారు. శ్రీ పద్మిని సినిమాస్ ద్వారా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఏప్రిల్ 10న ఈ చిత్రం గ్రాండ్‌గా విడుదల కానుంది.

Tags

Next Story