జిన్నింగు మిల్లులో భారీ అగ్ని ప్రమాదం

జిన్నింగు మిల్లులో భారీ అగ్ని ప్రమాదం
X

ఖమ్మం జిల్లా, కారేపల్లి మండల కేంద్రం సమీపంలోని అప్పాయిగూడెం పంచాయతీ పరిధిలో గల లక్ష్మి ప్రియ కోటక్ జిన్నింగు మిల్లులో శుక్రవారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం జరిగింది. పత్తిని పూర్తిగా రైతుల వద్ద నుంచి కొనుగోలు చేసి జిన్నింగు చేస్తున్న క్రమంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో లక్షలాది రూపాయలు విలువ చేసే పత్తితో పాటు మిషనరీకి కూడా పాక్షికంగా నష్టం వాటిల్లింది. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది సకాలంలో ఫైర్ ఇంజన్ ద్వారా మంటలను ఆర్పడంతో పెను నష్టం తప్పింది. ఈ ప్రమాదానికి సంబంధించి షార్ట్ సర్క్యూట్ వల్లే జరిగి ఉండవచ్చని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ విషయమై సిఎమ్‌ఓ గురురాజ్ కులకర్ణిని వివరణ కోరగా అంతా క్లియర్ అయ్యాక ఎంత నష్టం జరిగిందో తెలుస్తుందని అన్నారు.

Tags

Next Story