మేడ్చల్ లో అగ్నిప్రమాదం.. ఐదు బస్సులు దగ్ధం

X
హైదరాబాద్: మేడ్చల్ జిల్లా దుండిగల్ పరిధిలోని బౌరంపేట వద్ద భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఓ గ్యారేజ్‌లో పార్క్ చేసి ఉంచిన ఐదు బస్సులు మంటల్లో పూర్తిగా దగ్ధమయ్యాయి. బస్సులు పక్కపక్కనే ఉండటంతో ఒక బస్సు నుంచి మరో బస్సుకు మంటలు వేగంగా వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. మూడు ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు. గ్యారేజ్ సమీపంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం సంభవించి ఉండవచ్చని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. అగ్నిప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
Tags
Next Story
-
Home
-
Menu
