ప్లాస్టిక్ కుర్చీల తయారీ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

Fire Accident
X

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా నందిగామలోని ప్లాస్టిక్ కుర్చీల తయారీ పరిశ్రమలో వెల్డింగ్ పనులు చేస్తుండగా.. ప్రమాదవశాత్తూ మంటలు అంటుకుని భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో పరిశ్రమలో ఉన్న కుర్చీలు, ఇతర సామాగ్రి మంటల్లో దగ్ధమయ్యాయి. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని 5 ఫైరింజన్లతో మంటలార్పేందుకు శ్రమిస్తున్నారు. పరిశ్రమ పరిసరాల్లో దట్టమైన పొగ అలముకోవడంతో స్థానికులు ఇబ్బంది పడుతున్నారు.

Tags

Next Story