వందేభారత్ రైలు బోగీలో మంటలు.. తప్పిన ప్రమాదం

X
విజయవాడ: వందే భారత్ రైలు బోగీలో మంటలు వ్యాపించడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. విజయవాడ స్టేషన్‌లో రైలు ఆగి ఉన్న సమయంలో సి4 బోగీలో పొగ, మంటలు చూసి వెంటనే ప్రయాణికులు అప్రమత్తమయ్యారు. భయంతో బోగీలో నుంచి బయటకు పరుగులు తీశారు. రైల్వే సిబ్బంది వెంటనే మంటలు ఆర్పడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రమాదానికి కారణ:గా షార్ట్ సర్క్యూటా? లేక మరేదైనా కారణం ఉందా? అనే దానిపై రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Next Story
-
Home
-
Menu
