బ్రిడ్జిపై పూర్తిగా దగ్ధమైన కారు

బ్రిడ్జిపై పూర్తిగా దగ్ధమైన కారు
X

ఓ కారు మంటల్లో దగ్ధమైన సంఘటన కరీంనగర్ రాజీవ్ రహదారిపై ఉన్న అలగునూరు బ్రిడ్జిపై శనివారం చోటుచేసుకుంది. రన్నింగ్ లో ఉన్న కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగి క్షణాల్లో కారు మొత్తం వ్యాపించాయి. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ కారును పక్కకు ఆపడంతో లోపల ఉన్నవారు కిందకి దిగడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు , అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు.కారులో సాంకేతిక లోపం వల్ల మంటలు చెలరేగినట్లు పోలీసులు తెలిపారు. అంతకు ముందు బ్రిడ్జిపై కారు కాలిపోవడంతో ఇరువైపులా భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.

Tags

Next Story