రంగారెడ్డి జిల్లా.. ప్లాస్టిక్ రీసైక్లింగ్ పరిశ్రమలో అగ్నిప్రమాదం

రంగారెడ్డి జిల్లా.. ప్లాస్టిక్ రీసైక్లింగ్ పరిశ్రమలో అగ్నిప్రమాదం
X

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం బుద్వేల్ లో అగ్నిప్రమాదం జరిగింది. బుద్వేల్ ప్లాస్టిక్ రీసైక్లింగ్ పరిశ్రమలో మంటలు చెలరేగాయి. మంటలు ఎగసిపడుతుండడంతో పరిసరాల్లో దట్టంగా పొగ వ్యాపించింది. స్థానికుల సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Tags

Next Story